- పెరుగుతున్న వరద.. పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వం కీలక నిర్ణయం
గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎగువ కాఫర్ డ్యామ్‌ను పటిష్ఠపరచడంతో పాటు ఎత్తు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు యుద్ధ ప్రాతిపదికన ఎగువ కాఫర్ డ్యామ్‌ను మరో మీటరు మేర ఎత్తు పెంచేందుకు పనులు చేపట్టారు.
- 'అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలి'
అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులను తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తెలుగు రాష్ట్రాలకు స్పష్టం చేసింది. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన బోర్డు.. ఈ విషయాన్ని పేర్కొంది. ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల 13తో ముగిసింది.
- గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్లో ఆయన తూర్పు గోదావరి జిల్లా సహా పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ నుంచి తీసిన చిత్రాలు
- బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్.. 600మంది విద్యార్థులకు అస్వస్థత
బాసర ఆర్జీయూకేటీ విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. ఆర్జీయూకేటీలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. అత్యవసరంగా క్యాంపస్‌లోనే విద్యార్థులకు చికిత్స చేస్తున్నారు.
- టెన్త్ క్లాస్ విద్యార్థినిపై కారులో గ్యాంగ్ రేప్
పదో తరగతి విద్యార్థినిని కిడ్నాప్ చేసి.. ఆపై కారులో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఈ దారుణ ఘటన దిల్లీలో జరిగింది. మరోవైపు, లవర్‌తో మాట్లాడుతున్నందుకు కుమార్తెను గొంతు కోసి చంపేశాడు ఆమె తండ్రి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది.
- స్టంట్ పేరుతో నదిలోకి జంప్.. తిరిగిరాని యువకుడు.. వీడియో వైరల్!
వరద నీటిలో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని మాలేగావ్‌లో వెలుగుచూసింది. స్టంట్స్ పేరుతో బ్రిడ్జిపైనుంచి గిర్ణా నదిలోకి దూకాడు నయీమ్ అమీన్ అనే ఓ యువకుడు. ఇదంతా అతడి స్నేహితులు ఫోన్లో రికార్డు చేస్తున్నారు. కానీ.. నదిలో వరద ఉద్ధృతికి నయీమ్ కొట్టుకుపోయాడు. ఎంతసేపు గాలించినా.. అతడి ఆచూకీ లభించలేదు.
- 'లంకలో శాంతిభద్రతలను కాపాడుతా.. వారికి సర్వహక్కులు ఇస్తున్నా'
తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో శాంతి భద్రతలను పరిరక్షిస్తానని తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన రణిల్ విక్రమసింఘే తెలిపారు. అందుకు ఓ ప్రత్యేక కమిటీ నియమించానని, వారికి సర్వహక్కులు ఇస్తున్నట్లు కూడా చెప్పారు. మరోవైపు, కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ చేపట్టేందుకు శ్రీలంక పార్లమెంటు.. శనివారం సమావేశం కానుందని స్పీకర్ అభయ్‌వర్ధన తెలిపారు.
- ఎస్బీఐ రుణాలు మరింత భారం.. వడ్డీ రేట్లు పెంపు
SBI MCLR Rates Hike: ఎస్బీఐలో రుణాలు మరింత భారం కానున్నాయి. మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటును పది బేసిస్ పాయింట్ల మేర పెంచుతూ ఆ బ్యాంకు నిర్ణయం తీసుకుంది. సవరించిన రేట్లు జులై 15 నుంచే అమలవుతాయని పేర్కొంది.
- కోహ్లీకి ఒకరు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదు: రోహిత్
టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తాజాగా రెండో వన్డేలోనూ విఫలమవ్వడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అతడిని జట్టులో నుంచి తొలగించాలనే డిమాండ్లు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గతరాత్రి మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ.. కోహ్లీ ఫామ్‌పై ఎందుకింత చర్చ నడుస్తుందో తనకు అర్థంకావడం లేదని అసహనం వ్యక్తం చేశాడు.
- హాలీవుడ్ రేంజ్లో అఖిల్ 'ఏజెంట్' టీజర్
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఏజెంట్'. రామబ్రహ్మం సుంకర నిర్మాత. సాక్షి వైద్య కథానాయిక. మమ్ముట్టి ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని షురూ చేసింది.