JAGAN ON LIQUOR BAN: అధికారంలోకి రాకముందు.. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో మద్య నిషేధంపై ముఖ్యమంత్రి మొదటి పలుకులు.. రోజులు గడిచేకొద్దీ పూర్తిగా మారిపోయాయి. సీఎం జగన్ మాటమారింది.. మడమ తిరిగింది.(bar license) మేనిఫెస్టోలో హామీకి మంగళం పాడేశారు. తాజాగా బార్ల వేలమే దీనికి ఉదాహరణ. నూతన విధానంలో భాగంగా 838బార్లకు వేలం నిర్వహించారు. 815 బార్లకు.. లైసెన్సులు ఖరారు చేశారు. చాలాచోట్ల వ్యాపారులు.. సిండికేట్‌గా మారి కనీస(ysrcp strategy ) ధరపై అదనంగా.. 2 లక్షలు, 4 లక్షల రూపాయలు మాత్రమే పాడి లైసెన్సులు దక్కించుకున్నారు. 51 బార్లు వేలంలో కోటి రూపాయలుపైనే పలకగా.. మరికొన్ని 90 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య పలికాయి. ఇంత డబ్బు వెచ్చించి లైసెన్సులు దక్కించుకున్న వ్యాపారులు.. పెట్టుబడితోపాటు లాభాల కోసం మద్యం(liquor ban) అమ్మకాలు పెంచుకోడానికే ప్రయత్నిస్తారు. కడపలో ఇప్పటివరకూ(liquor ban in ap) బారు లైసెన్సు రుసుము రూ.35 లక్షలుగా ఉంది. అక్కడ రాష్ట్రంలోనే అత్యధికంగా కోటి 83 లక్షల 90 వేల రూపాయలకు ఓ వ్యాపారి వేలంలో లైసెన్సు దక్కించుకున్నారు. ఆ మొత్తం రాబట్టుకోవాలంటే.. రోజుకు కనీసం 3 నుంచి 4 లక్షల రూపాయల సరుకు అమ్మాలి. దీని కోసం.. విక్రయాలైనా పెంచుకోవాలి, అధిక రేట్లకైనా అమ్మాలి. రెండింటిలో ఏది జరిగినా.. మద్యపాన నిషేధం హామీకి.. తూట్లు పడినట్లే.
దశలవారీ మద్య నిషేధం అమలు చేయాలంటే.. బార్ల సంఖ్య తగ్గాలి. కానీ అదేమీ లేదు. వైకాపా అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో.. 840 బార్లుండగా.. 2019 నవంబరు 22న వాటి లైసెన్సులన్నింటినీ ఉపసంహరించుకుంది. దశలవారీ మద్యనిషేధంలో భాగంగా 840 బార్లలో 40 శాతం తగ్గిస్తున్నామని,... కేవలం 487 బార్లకే నోటిఫికేషన్ ఇస్తున్నామని ప్రకటించింది. ఐతే తమకు 2022 జూన్ నెలాఖరు వరకూ కొనసాగే(e aucion for bar license) హక్కు ఉందని బార్ల యజమానులు(liquor ban issue) కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు రావడంతో.. ఆ బార్లు ఇప్పటి వరకూ కొనసాగాయి. అప్పట్లో దశలవారీ మద్యనిషేధమంటూ బార్ల సంఖ్యను కుదించిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా 838 బార్లకు వేలం నిర్వహించింది. 2024 నాటికి.. స్టార్ హోటళ్లకే మద్యం పరిమితం చేస్తామన్నది జగన్ హామీ. ఎక్సైజ్ బార్ లైసెన్సులు జారీ చేసింది 2025 ఆగస్టు 31 వరకూ. వైకాపా ప్రభుత్వ పదవీ కాలం కూడా 2024 మే వరకే ఉంది. ఇప్పుడు జారీ చేసిన.. బార్ల లైసెన్సుల కాలపరిమితి 2025 ఆగస్టు 31 వరకూ ఉంది. అంటే ఈ ప్రభుత్వ హయాంలో మద్య నిషేధం అమలు లేనట్టే కదా! మాట తప్పి.. మడమ తిప్పినట్లేకదా?.
మద్య నిషేధం హామీపై జగన్ ప్రభుత్వం మాట తప్పిందనడానికి మరో ఉదాహరణ ఇటీవల మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన వ్యాఖ్యలు. నిషేధిస్తామని తాము మేనిఫెస్టోలో చెప్పనేలేదని.. ఫైవ్‌స్టార్ హోటళ్ల వరకే మద్యాన్ని పరిమితం చేస్తామని మాత్రమే(ysrcp election startegy) చెప్పామని అన్నారు అమర్‌నాథ్. గతంలో.. నగరపాలక సంస్థల సరిహద్దుల నుంచి 5 కిలోమీటర్ల వరకూ,... పురపాలక, నగర పంచాయతీల సరిహద్దుల నుంచి 2 కిలోమీటర్ల వరకు మాత్రమే.. బార్ల ఏర్పాటుకు అవకాశం ఉండేది. ఇప్పుడు నగరపాలక సంస్థల సరిహద్దుల నుంచి 10 కిలోమీటర్లు.. పురపాలక, నగర పంచాయతీల సరిహద్దుల నుంచి 3 కిలోమీటర్ల దూరం వరకూ బార్లు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పించారు. ఫలితంగా ఇప్పటి వరకూ.. బార్లు లేని శివారు ప్రాంతాల్లోనూ కొత్తవి వచ్చాయి. ఇది కొత్త ప్రాంతాల్లో మద్యం అందుబాటులోకి తీసుకురావటమే కదా? ఇది దశలవారీ మద్యనిషేధం ఎలా అవుతుందనేది ఎవరికీ అంతుచిక్కడంలేదు.
ఇవీ చదవండి: