హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైకాపా నేతలు మాట్లాడటం సరికాదని ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. పరమత సహనాన్ని కాపాడాలని సూచించారు. అనవసరంగా గొడవలకు దారి తీయొద్దని హితవు పలికారు. తనను వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా లక్ష్యంగా చేసుకున్నారన్న రఘురామ.. సీఎం జగన్‌పై వ్యంగ్య బాణాలు సంధించారు.
మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలపై ఎంపీ రఘురామకృష్ణరాజు మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలతో భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. హిందువుల మనోభావాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని సూచించారు. తితిదేలో ఇద్దరు అధికారులను ఎందుకు మార్చాల్సి వచ్చిందని రఘురామ ప్రశ్నించారు. వెంకటేశ్వరస్వామి డబ్బుపై కన్ను వేశారని అందరూ అనుకుంటున్నారని.. అమరావతి అంశంపై న్యాయ సలహాలు తీసుకొని మాట్లాడాను అని పేర్కొన్నారు. అమరావతే రాజధానిగా ఉండాలని పవన్ ఇప్పుడు స్పష్టంగా చెప్పారన్నారు. తనపై కేసులు పెట్టిస్తూ సీఎం తన స్థాయి తగ్గించుకుంటారని అనుకోలేదని చెప్పారు.
ఇదీ చదవండి: