ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా తెదేపా అధఇనేత చంద్రబాబు అడ్డుకుంటున్నారని మంత్రులు, వైకాపా నేతలు ఆరోపించారు. గవర్నర్ కు ఫిర్యాదు చేసి.. రాష్ట్రంలో ఏదో జరుగుతున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.
గవర్నర్ ఏం చేయాలో కూడా తెదేపా నేతలు సలహాలు ఇవ్వడం విచిత్రంగా ఉంది. గవర్నర్‌కు యనమల లేఖ రాసి ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. అధికారంలో తాము ఉంటేనే అన్ని సక్రమంగా జరుగుతాయని యనమల భ్రమ పడుతున్నారు. 5 ఏళ్లల్లో చంద్రబాబు ప్రభుత్వం అమరావతిలో ఏం అభివృద్ధి చేసింది. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తామనంటే తెదేపా ఎందుకు అడ్డుకుంటోంది చెప్పాలి. అమరావతి శాసన రాజధానిగా ఉంటుంది, ఎలాంటి అనుమానాల్లేవు. విశాఖ అభివృద్ధి తెదేపాకు అవసరం లేదా?. రాష్ట్రంలో ప్రజలు వికేంద్రీకరణనే కోరుకుంటున్నారు.
- కురసాల కన్నబాబు, మంత్రి
అక్రమాలు కప్పిపుచ్చుకునేందుకు తెదేపా ప్రయత్నిస్తోంది. అభివృద్ధి వికేంద్రీకరణను ఎందుకు అడ్డుకుంటున్నారో తెదేపా నేతలు చెప్పాలి. గతంలో జరిగిన వ్యవహారాలను బయటపెడుతుంటే తెదేపా నేతలు రాష్ట్రపతి వద్దకు, గవర్నర్ వద్దకూ వెళ్తున్నారు.
- ఆదిమూలపు సురేశ్, మంత్రి
రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధే సీఎం జగన్ లక్ష్యం. ఉత్తరాంధ్రకు రాజధాని రాకుండా చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారు. విశాఖను రాజధానిగా కాకుండా చెయ్యాలని చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారు. మూడు రాజధానులతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. మూడు రాజధానుల అంశాన్ని కౌన్సిల్లో తెదేపా అడ్డుకుంది.
-మంత్రి అవంతి శ్రీనివాస్
-
ఇదీ చదవండి: