రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా ఉండాలనే.. తెలంగాణలో వైకాపాను స్థాపించలేదని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో పార్టీ పెడతానని వైఎస్ షర్మిల గతంలోనే చెప్పారని.. ఆ మేరకు పార్టీ ఏర్పాటు చేశారని అన్నారు.
షర్మిల పార్టీ గురించి తాము మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రెవేటికరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశామన్న సజ్జల తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేయాల్సింది అంతా చేస్తోందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: