YS Vijayamma Resignation: వైకాపాకు విజయమ్మ రాజీనామా చేయడంపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మతో మీరు, సోదరుడు జగన్ కలిశారు కాబట్టి.. పొరపచ్చాలు తొలగినట్లేనా అన్న ప్రశ్నకూ.. అలాగే స్పందించారు.
గుంటూరు జిల్లా చినకాకానిలో జరుగుతున్న వైకాపా ప్లీనరీ వేదికగా.. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. విమర్శలకు తావు లేకుండా తాను ఈ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వివరించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
విమర్శలకు తావు లేకుండా ఉండేందుకే పార్టీ నుంచి తప్పుకుంటున్నా. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే రాజీనామా. షర్మిల ఒంటరి పోరాటానికి అండగా ఉండేందుకే ఈ నిర్ణయం. కష్టాల్లో ఉన్నప్పుడు నా కొడుకు జగన్‌తో ఉన్నా.. సంతోషం ఉన్నప్పుడు కూడా అండగా ఉంటే నా రక్తం పంచుకున్న బిడ్డ షర్మిలకు అన్యాయం చేసినదాన్ని అవుతానేమోనని నా మనస్సాక్షి చెబుతోంది. నా ఉనికి ఎవరికీ వివాదాస్పదం కాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. ఈ విషయంలో నన్ను క్షమించాలి. -వై.ఎస్.విజయమ్మ
ఇదీ చదవండి: Y.S. Vijayamma Resign: వైకాపాకు 'అమ్మ రాజీనామా'.. కుమార్తె కోసం