తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి.. పబ్లిసిటీ కోసం గాంధీ దవాఖానాకు వెళ్లారని వైఎస్ షర్మిల విమర్శించారు. ఒకవైపు వైరస్ విజృంభణతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాత్రం అంతా బాగుందని అనడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్ర ప్రజలు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి దారుణంగా ఉందన్న షర్మిల.. తెరాస ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోవడంలేదని ఆరోపించారు. వివిధ జిల్లాల డ్వాక్రా సంఘాల మహిళలతో షర్మిల వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా సమయంలో చికిత్సల కోసం, కుటుంబ పోషణ కోసం డ్వాక్రా మహిళలు 10 వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారని.. ఇది గతేడాదితో పోలిస్తే.. 60 శాతం అధికమని ఆమె చెప్పారు. ఉపాధి లేక, ప్రభుత్వం ఆదుకోక లక్షలాది మంది మహిళలు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: