తెలంగాణ రాష్ట్రం రాజేంద్రనగర్ నియోజక వర్గం అత్తాపూర్ మారుతీనగర్‌లో ఓ సామాజిక వర్గానికి చెందిన యువకులు రెచ్చిపోయారు. గంజాయి సేవిస్తూ... తల్వార్లతో దాడులకు పాల్పడుతూ స్థానికులను భయాందోళనలకు గురిచేశారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ... మద్యం సేవించి, రోడ్డుపై వెళ్తున్న వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆకతాయిలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలని బస్తీవాసులు పోలీసులను కోరారు.
ఇదీ చూడండి: