హైదరాబాద్ నిజాంపేటలో ఓ యువతి ట్రాఫిక్ నిబంధనల (Traffic Rules) ఉల్లంఘనలు చూసి పోలీసులు అవాక్కయ్యారు. ఏకంగా 22 సార్లు సెల్‌ఫోన్ డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ పోలీసుల కెమెరాలకు చిక్కింది. సదురు యువతికి ఏకంగా దాదాపు రూ. 9 వేల పెనాల్టీలు (Challan) వేశారు. కొందరు ద్విచక్ర వాహనాలపై వివిధ రకాలు ఫీట్లు చేస్తుండటాన్ని పోలీసులు గుర్తించారు. కానీ ఈ యువతి ఎలాంటి భయం, జంకూ లేకుండా ట్రాఫిక్ పోలీసుల (Traffic Rules) ఫొటోలకు ఫోజులిచ్చింది.
కూకట్పల్లి, నిజాంపేట వద్ద విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు రెండు రోజులు కిందట బైక్పై చరవాణిలో మాట్లాడుతూ వెళుతున్న యువతి కనిపించింది. వెంటనే కానిస్టేబుల్ ఫొటో తీయగా... చలాన్ నమోదైంది. వరుసగా అదే విధంగా రోజూ వాహనం నడపగా పోలీసులు చలాన్లు (Challan) విధించారు. ఆమె ఉల్లంఘనలపై దృష్టి పెట్టిన పోలీసులు వాహనంపై 22 చలాన్లు ఉన్నట్లు గుర్తించారు. తల్లిదండ్రుల సమక్షంలో ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చిన కూకట్పల్లి ట్రాఫిక్ పోలీసులు జరిమానా రూ. 9,070 కట్టించుకుని పంపించారు.
ఇదీ చదవండి: