స్థానిక ఎన్నికల వాయిదా అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తామని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర అధికారులతో సంప్రదించకుండా ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించిన ఆయన.. నైతికత ఉంటే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 243కె, 243 జడ్ ఏ ఆర్టికల్‌ను తుంగలో తొక్కారని విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు.
ఇదీ చూడండి: