ETV Bharat / city

దిల్లీకి వైకాపా ఎంపీ బాలశౌరి.. కేంద్ర మంత్రులతో 'కీలక' అంశాలపై చర్చ! - ycp mp balasouri meeting news

వైకాపా ఎంపీ బాలశౌరి దిల్లీలో కేంద్ర మంత్రులను కలిశారు. రాజ్​నాథ్​ సింగ్​, ప్రహ్లాద్​ జోషి, సదానందగౌడలతో సమావేశమైన ఆయన లోక్​సభ స్పీకర్​తోనూ భేటీ అయ్యారు. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం, ఏపీకి బొగ్గు కేటాయింపులు, మచిలీపట్నం ఫార్మా పార్క్​ అంశాలపై మంత్రులతో చర్చించినట్లు సమాచారం.

కేంద్ర మంత్రులతో వైకాపా ఎంపీ బాలశౌరి భేటీ.. కారణం ఇదీ..!

author img

By

Published : Jun 29, 2020, 4:47 PM IST

వైకాపా ఎంపీ బాలశౌరి దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​ సింగ్​, ప్రహ్లాద్​ జోషి, సదానందగౌడలతో ఆయన సమావేశమయ్యారు. ఆదివారం సాయంత్రం లోక్​స్పీకర్​తోనూ సమావేశమైన బాలశౌరి.. ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై చర్చించినట్లు సమాచారం. నాగాయలంక మిస్సైల్​ పరీక్ష కేంద్రం శంకుస్థాపనకు రావాలని ఆహ్వానించారు. ఏపీకి బొగ్గు కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రులతో చర్చించారు. మచిలీపట్నం వద్ద ఫార్మా పార్క్​ ఏర్పాటుపైనా చర్చలు జరిపినట్లు తెలిసింది.

ఇదీ చూడండి:

అధికారమే పరమావధిగా..వైకాపా తత్వం: యనమల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.