తెదేపా అధినేత చంద్రబాబు రేణిగుంటలో చేసిన నిరసన ఒక హైడ్రామా అని వైకాపా ఆరోపించింది. ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతోనే చంద్రబాబు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆక్షేపించారు. 2019 సాధారణ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిశాక అప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం చేశారన్నారు. నిబంధనలు ఉల్లంఘించడం వల్లే పోలీసులు అనుమతులు ఇవ్వలేదన్నారు. ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరామని పోలీసులు చెప్తే గర్జిస్తున్నారని విమర్శించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కానిస్టేబుల్ కూడా అరెస్ట్ చేస్తారన్నారు.
ఎన్నికల కోడ్ లేదు, కరోనా లేకపోయినా... 2017 విశాఖ విమానాశ్రయంలో కనీసం లాంజ్‌లోకి కూడా జగన్‌ను అనుమతించలేదని అంబటి అన్నారు. రన్ వేపై మేము మండుటెండలో కూర్చుని నిరసన తెలిపామన్నారు. ఆ రోజు జగన్ ప్రతిపక్ష నాయకుడే అయినా అనుమతించలేదన్నారు. చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న నిరసన అడ్డుకుంటే అది అప్రజాస్వామ్యమా అని ప్రశ్నించారు. పిచ్చి చేష్టలు చేస్తే ప్రభుత్వం సహించదని హెచ్చరించారు.
ఇదీ చదవండి: