రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వానికి(YCP government) వస్తున్న ఆదరణ చూసి.. తెదేపా నేతలు ఓర్వలేకపోతున్నారని వైకాపా నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైకాపా ప్రభుత్వంపై.. తెలుగుదేశం నేత పట్టాభి రామ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఇందులో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
విజయవాడ(vijayawada) వన్‌టౌన్‌లో తెదేపా నాయకులకు వ్యతిరేకంగా.. దుర్గగుడి ఛైర్మన్ పైలా సోమినాయుడు ఆధ్వర్యంలో వైకాపా నేతలు నిరసన అందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీ(rally) నిర్వహించారు. తెదేపా అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెనమలూరు పోలీస్‌స్టేషన్(penmaluru police station)లో చంద్రబాబు, లోకేశ్ పై ఫిర్యాదు కూడా చేశారు.
తెదేపా నేత పట్టాభిరామ్‌ను వెంటనే అరెస్టు చేయాలని జగ్గయ్యపేట వైకాపా నాయకులు(jaggayyapeta YCP leaders) డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా కంచికచర్ల(kanchikacharla)తోపాటు మైలవరం(mailavaram)లో వైకాపా నేతలు ర్యాలీ చేపట్టారు. నందిగామలో వైకాపా నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట జరిగింది.
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో(p.gannavaram) తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైకాపా నేతలు నిరసన చేపట్టారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి(thurupathi MP gurumurthy) ఆధ్వర్యంలోనూ ఆందోళనలు చేశారు. విశాఖ జిల్లా పాడేరులో(paderu)నూ నిరసన చేపట్టారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేపట్టారు.
ఇవీచదవండి.