వైకాపా ప్రభుత్వ పథకాలు చూసి చంద్రబాబుకు కడుపుమంటగా ఉందని వైకాపా సీనియర్ నేత పార్థసారథి పేర్కొన్నారు. కార్యకర్తల భేటీల్లోనూ చంద్రబాబు దారుణంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలు తెదేపాను ఎందుకు తిరస్కరించారో తెలుసుకోవడం లేదన్నారు. కృష్ణా, గోదావరిలో వరద వల్ల ఇసుక కొరత ఉన్నమాట వాస్తవమేనన్న పార్థసారథి... సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... శ్రీశైలం, సాగర్‌కు భారీగా వరద.. దిగువకు నీటి విడుదల