ETV Bharat / city

ఏపీ సర్వనాశనమే జగన్ స్వప్నం: యనమల - yanamala serious comments on ys jagan, over xcapital city changing

వైకాపా ప్రభుత్వంపై మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ఏపీకి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ పెంచితే... ఆ ప్రతిష్ట నాశనం చేయటమే లక్ష్యంగా సీఎం జగన్ పనిచేస్తున్నారని మండిపడ్డారు.

ఏపీ సర్వనాశనమే జగన్ స్వప్నం: యనమల
author img

By

Published : Aug 27, 2019, 11:08 AM IST

అమరావతిలో ఎకానమి దెబ్బతీసి, హైదరాబాద్‌ సంపద పెంచడమే జగన్‌ లక్ష్యమని మండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. తెరాస రుణం తీర్చుకోడానికి ఏపీ అభివృద్ధికి గండి కొట్టడం హేయమని దుయ్యబట్టారు. జగన్ రివర్స్ రూలింగ్ దుష్ఫలితమే ప్రస్తుత ఆర్ధిక మాంద్యమని యనమల ధ్వజమెత్తారు. సీఎం జగన్ ఆదేశాలతోనే రాజధానిపై బొత్స వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. అమరావతి అభివృద్దిని రివర్స్‌లో తలకిందులు చేశారని ఆక్షేపించారు. సొంత ఎకానమీ పెంచుకోడం పైనే జగన్ దృష్టి అన్న యనమల... రాష్ట్ర ఎకానమికి తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సర్వనాశనం కావాలన్నది జగన్‌ విధ్వంసక స్వప్నమని యనమల మండిపడ్డారు. ఏపీకి చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా ఇమేజ్ పెంచితే..., చంద్రబాబు తెచ్చిన ప్రతిష్ట నాశనం చేయడమే జగన్ లక్ష్యమని దుయ్యబట్టారు. బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారన్న ఆయన... వ్యవసాయం, పరిశ్రమలు, ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఉపాధి అన్ని రంగాలకు తూట్లు పొడిచారని విమర్శించారు. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు ఏపీకి వెన్నెముకలు అయితే 3 నెలల్లోనే వాటి వెన్ను విరిచారన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.