రాష్ట్రం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించక తప్పదని హెచ్చరించే స్థాయికి చేరిందన్నారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారని చెప్పారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ది పాతాళానికి దిగజారిందని, ప్రజల ఆదాయం దారుణంగా పడిపోయిందని యనమల అన్నారు. ఆ ప్రభావం రాష్ట్రాభివృద్ధి, పేదల సంక్షేమంపై పడిందని ఆందోళన చెందారు.
రాష్ట్ర అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటిపోయాయని, దీనిపై కేంద్రమంత్రులు హెచ్చరించినా పెడచెవిన పెట్టారని యనమల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది అసలు వడ్డీ చెల్లింపులకే రూ.40,500 కోట్లు ఖర్చు చేయాలని, ఇది మోయలేని భారమేనని స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం పడిపోవడం ఆందోళనకరమని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలని.. ఆర్ధిక సంక్షోభం నుంచి గట్టెక్కించే చర్యలు చేపట్టాలని యనమల రామకృష్ణుడు హితవు పలికారు.
ఇదీ చదవండి: