"ఏపీలో చట్టబద్ధ పాలన ఉందా? లేక జగన్ రూల్ ఆఫ్ లా’’ ప్రత్యేకంగా తెచ్చారా అని శాసనసమండలిలో ప్రతిపక్ష నేత యనమల ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని అణిచివేత ఏపీలో ఉందని మండిపడ్డారు. ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్న యనమల.. రాజ్యాంగ హక్కులను హరించివేశారని ఆరోపించారు. దరఖాస్తు చేసినా నిరసనలకు అనుమతులు ఇవ్వలేదని.. ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దమనకాండ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదని పేర్కొన్నారు. అక్రమ గృహ నిర్బంధాలు అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకమని యనమల అన్నారు. వైకాపా రాజ్యాంగ వ్యతిరేక చర్యలను ప్రతిఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: