ETV Bharat / city

'జగన్ అక్రమాస్తులపై పోరాడినందుకే కక్ష సాధిస్తున్నారు' - దీళిపాళ్ల నరేంద్ర అరెస్ట్​ తాజా వార్తలు

తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టును.. ఆ పార్టీ నేతలు దేవినేని ఉమ, యమనల రామకృష్ణుడు ఖండించారు. జగన్ అక్రమాస్తులపై ధూళిపాళ్ల పోరాడినందుకే రాజకీయ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు.

yanamala, devineni uma comments on dhulipalla narendra arrest

author img

By

Published : Apr 23, 2021, 1:31 PM IST

తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్‌ను తెదేపా నేతలు ఖండించారు. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్ చేయడం సీఎం జగన్​ కక్ష సాధింపు రాజకీయాలకు పరాకాష్ట అని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. తెదేపాపై కక్షతో సంగం డెయిరీపై ప్రతీకారం తీర్చుకుంటున్నారని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. ధూళిపాళ్ల నరేంద్రను విడుదల చేసి.. ఆయనపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని యనమల రామకృష్ణుడు డిమాండ్​ చేశారు.

కరోనా విజృంభిస్తుంటే.. సీఎం కక్షసాధింపు చర్యలేంటని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. పైశాచిక ఆనందం కోసం విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారని దుయ్యబట్టారు. సంగం డెయిరీకి దేశవ్యాప్తంగా ఎంతో మంచి పేరుందని అన్నారు. అమూల్ డెయిరీకి ప్రోత్సాహం దొరక్కే కుట్ర పన్నారని దేవినేని ఉమ ఆరోపించారు. జగన్ అక్రమాస్తులపై పోరాడినందుకే కక్ష సాధిస్తున్నారని అన్నారు.

కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 29న సీఐడీ విచారణకు హాజరుకానున్నట్లు దేవినేని ఉమ తెలిపారు. తనపై తప్పుడు కేసులకు సంబంధించి అన్ని అధారాలు అందజేస్తానని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.