ఆర్థిక శాఖలో మంత్రి చేసిన తప్పులకు కింది స్థాయి ఉద్యోగులు, అధికారులను శిక్షించడం ఏంటని శాసనమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులకు.. మంత్రివర్గం ట్రస్టీనే తప్ప యజమాని కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీకి, కాగ్, కేంద్ర ఆర్థిక సంస్థలకు తెలియకుండా వివరాలు దాచాల్సిన అవసరమేంటని నిలదీశారు. మంత్రివర్గం.. అవినీతి, దుబారా చేస్తున్నందునే సమాచారాన్ని రాజ్యాంగ సంస్థలకు తెలియకుండా తొక్కిపెట్టారని ఆరోపించారు.
ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతూ.. అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ.. వారి దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నారన్నారని యనమల రామకృష్ణుడు అన్నారు. సచివాలయ ఉద్యోగులపై చర్యలు కూడా ఈ కోవలోనివే అని ఆరోపించారు. అప్పుల సంక్షోభానికి మంత్రివర్గ అవినీతి, దుబారాలే ప్రధాన కారణమని యనమల ఆరోపించారు.
ఇదీ చదవండి: