రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలపై లోక్సభలో వైకాపా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి తోమర్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. రాష్ట్ర విభజన చట్టం, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున నాలుగు దఫాలుగా నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. రూ.2100 కోట్లకు నీతిఆయోగ్ సిఫార్సు చేయగా.. రూ.1400 కోట్లు మంజూరు అయ్యాయని చెప్పారు. రూ.1049.34 కోట్లకే వినియోగ ధ్రువీకరణ పత్రాలు అందించామన్నారు.
ఇదీ చదవండి:
సీఎం ఒప్పుకున్నాకే.. ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం అడుగులు: సబ్బం హరి