ETV Bharat / city

అమరావతి ఉద్యమంలో అపరదుర్గలు.. అతివలు!

author img

By

Published : Dec 17, 2020, 6:55 AM IST

అతివలకు పుట్టినిల్లు, మెట్టినిల్లు ఉంటాయి. కానీ ఏడాదిగా అమరావతి మహిళలకు ఉద్యమ శిబిరాలే సర్వస్వమయ్యాయి. పండగైనా, పబ్బమైనా పోరాట పంథా వీడలేదు. ఉంటే ఇల్లు, లేదంటే దీక్షా శిబిరం. లాఠీ దెబ‌్బలు తిన్నారు, ఇనుప కంచెలు దాటారు, ఖాకీ బూట్ల కింద నలిగారు, పోలీస్టేషన్ల చుట్టూ తిరిగారు, అవమానాలు ఎదుర్కొన్నారు, అవహేళనలను తట్టుకున్నారు.. ఐనా ఉద్యమాన్ని వదిలింది లేదు, అమరావతి నినాదాన్ని ఆపిందీ లేదు.! ఏడాది పొడవునా అదే ఉత్సాహం.. అదే ఉత్తేజం. ఒకటే విధానం.. ఒకటే నినాదం. అమరావతే అంతిమం.! అతివలే అపర దుర్గలై.. పోరాడుతున్నారు. అమరావతి ఉద్యమజ్వాలను.. ఆరిపోకుండా ఏడాదిగా రగిలిస్తున్నారు.

amaravati ladies protests
అమరావతి ఉద్యమంలో అతివలు

రోడ్లపై ధర్నాలు, ట్రాక్టర్లతో ర్యాలీలు, మహా పాదయాత్రలు, రహదారి దిగ్బంధాలు, అసెంబ్లీ ముట్టడి, సామూహిక పారాయణాలు, దేవుళ్లకు పొంగళ్లు.. ఇలా విభిన్న రూపాల్లో అప్రతిహతంగా సాగుతున్న అమరావతి ఉద్యమంలో ముందుంటోంది అతివలే. రాజధాని సాధన పోరులో రైతులున్నారు, కూలీలున్నారు, ఎస్సీలున్నారు, బీసీలున్నారు, పదహారేళ్ల యువకులున్నారు, 60 ఏళ్ల వృద్ధులున్నారు.. వీరందరినీ ముందుండి నడిపిస్తోంది మహిళలే.! రాజధాని గ్రామాల్లోని ఏ దీక్షా శిబిరం చూసినా అతివల భాగస్వామ్యమే అధికం. ఓ వైపు ఇల్లు చ‌క్కదిద్దుకుంటూనే.. ఉద్యమానికి వెన్నెముకగా నిలిచారు. పండగైనా, పబ్బమైనా దీక్షా శిబిరాల్లోనే జరుపుకున్నారు. సంక్రాంతి నాడు రంగవల్లులను, గొబ్బెమ్మలను అమరావతి నినాదాలతో నింపేశారు.

అమరావతి ఉద్యమంలో అతివలు

అన్నింటా తామై...

ఓ విధంగా చెప్పాలంటే రాజధాని ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ.. మహిళా రైతులే. పొలాల్లో కంకులు కోసిన చేతులతో పిడికిళ్లు బిగించారు. తమ ఇంటి పెద్దలపై కేసులు పెట్టడం.. వారిలో కసి పెంచింది. పిల్లల భవిష్యత్‌ తలచుకుని తల్లడిల్లారు. ఆరునూరైనా అమరావతి అంగుళమూ కదలాడనికి వీల్లేదని నిశ్చయించుకున్నారు. నాటి ప్రభుత్వానికి భూములిప్పించడంలో ఎలాగైతే ఇంటిపెద్దకు నచ్చజెప్పారో.. అలాగే నేటి సర్కారుని దారికి రప్పించడంలోనూ ముందుంటామని చాటారు. ప్రత్యక్ష ఉద్యమంలోకి దూకారు. ఐకాస ఏ కార్యక్రమం తలపెట్టినా చిత్తశుద్ధితో పాలుపంచుకున్నారు.. లాఠీ దెబ్బలు తిన్నారు. పోలీసులు బూటు కాళ్లతో తన్నితే పంటిబిగువున భరించారు. పోలీస్టేషన్‌ల చుట్టూ తిప్పినా ఆత్మ స్థైర్యం కోల్పోలేదు. ఉద్యమ లక్ష్యం ముందు ఇవేమీ పెద్ద ఇబ్బందులు కావనుకున్నారు.

సంయమనమే శ్వాసగా...

అసెంబ్లీ ముట్టడి, జాతీయ రహదారి దిగ్బంధం వంటి కార్యక్రమాల్లో మహిళల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. శాంతియుత ధర్నా చేస్తున్న అతివలను వ్యాన్లలోకి ఈడ్చి పడేశారు, సీట్ల మధ్య కుక్కేశారు. పోలీసులు అర్థరాత్రిళ్లు తలుపుతట్టినా ఇదేమిటని నిలదీశారే గానీ.. మాట మీరలేదు, సంయమనం కోల్పోలేదు. పోరాటం ప్రభుత్వం విధానంపైన గానీ.. పోలీసులపై కాదని సముదాయించుకున్నారు. తమపై లాఠీ ఎత్తిన ఖాకీలకూ అన్నపానీయాలు అందించి.. మానవత్వాన్ని ప్రదర్శించారు.

అపర దుర్గలా మారి...

ఏడాదిగా జరుగుతున్న ఉద్యమంలో మహిళలు ఎంత సహనం ప్రదర్శించారో అంతే సమరోత్సాహం చూపించారు. పాదయాత్రలంటే చాలు.. పదండి పోదాం అంటూ అందరినీ పోగేశారు. దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించారు. మొక్కులు తీర్చుకునేందుకు మూకుమ్మడిగా కదిలారు. ఆ సమయంలో పొలిమేరలు దాటడానికి వీల్లేదంటూ పోలీసులు అడుగడుగునా అడ్డుతగిలారు. ఒక్కో మహిళ ఒక్కో అపరదుర్గలా మారారు. దారిపొడవునా వాదులాడుతూనే గమ్యం చేరుకున్నారు. తమ బాధలను కనకదుర్గకే విన్నవించుకున్నారు.

పురుషులకు దీటుగా...

కరోనా సమయంలోనూ మహిళలు ఉద్యమ స్ఫూర్తి వీడలేదు. అమరావతి వెలుగు పేరిట రోజూ రాత్రి సమయంలో ఇళ్లలో విద్యుత్‌ దీపాలు ఆపి.. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి నిరసనలు తెలిపారు. పొలాలు ఇచ్చినందుకు గౌరవం దక్కకపోగా అవమానాలు, అవహేళనలు చేయడం.. వారిలో మరింత కసి పెంచింది. నాలుగు పర్యాయాలు దిల్లీ వెళ్లి జాతీయ నాయకుల సంఘీభావం కోరారు. కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలను కలిసి.. ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. మగవాళ్లు ఆశ్చర్య పడేలా అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. ఇక ముందూ నడిపిస్తామని ఒట్టుపెట్టుకుంటున్నారు.

ఇదీ చదవండి:

365 రోజుల అమరావతి ఉద్యమానికి.. 365 సెకన్ల దృశ్యరూపం..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.