తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామ శివారులో సావిత్రి దారుణ హత్యకు గురైంది. ఆమె ఇస్నాపూర్లో నివాసం ఉంటూ కూలి పని చేస్తుంది. కల్హేర్ మండలం నాగధార గ్రామం నుంచి బతుకుదెరువు కోసం భర్తతో కలిసి ఇక్కడికి వచ్చిందని పోలీసులు తెలిపారు.
శుక్రవారం సాయంత్రం గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. వారే అత్యాచారం అనంతరం హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సావిత్రి కనబడటంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. తెల్లవారేసరికి హత్యకు గురైందని బంధువులు వాపోయారు.
ఇదీ చూడండి: