మానసిక రుగ్మతల కారణంగా ఓ మహిళ... మూడేళ్ల కూతురుకి ఉరివేసి తనూ బలవన్మరణానికి పాల్పడిన ఘటన... తెలంగాణలోని సికింద్రాబాద్ ఆల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ నెల 22న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని మీయూరభంజ్ జిల్లా బారిపాడకు చెందిన సుధేందుగిరి జీవనోపాధి కోసం నగరానికి వచ్చాడు. అల్వాల్ పరిధిలోని భరత్ నగర్లో నివసిస్తూ... సిద్దిపేట ప్రాంతంలోని ఓ ఫార్మా సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
ఆయనకు దాదాపు ఎనిమిదేళ్ల కిందట బిష్ణుప్రియ(30) అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి మూడున్నరేళ్ల కూతురు ప్రీతిక జన్మించింది. ఈ నెల 22న ఉదయం సుధేందుగిరి రోజూ మాదిరిగా ఉద్యోగానికి బయలుదేరాడు. అతను తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చి చూసేసరికి... తల్లీకూతుళ్లు విగతజీవులై కనిపించారు.
మొదట కుమార్తెను చంపి...
కుమార్తె ప్రీతికకు మొదట చంపి... అనంతరం బిష్ణుప్రియ చీరతో సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకొని ఉండటాన్ని గమనించినట్లు సుధేందుగిరి పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనకు సంబంధించి ఎవరిపై ఎలాంటి అనుమానాలు లేవని ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: