తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి జల్పల్లి చెరువు సమీపంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మహిళను బండరాయితో మోది దారుణంగా హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.
మృతురాలి ఒంటిపై దుస్తులు సరిగ్గా లేనందున అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఆనవాలు కన్పిస్తున్నాయి. పహడీషరీఫ్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఎల్బీనగర్ డీసీపీ సన్ ప్రీత్ సింగ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
ఇదీ చదవండి: విజయవాడలో హైటెక్ వ్యభిచారం గుట్టురట్టు