తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం పెద్ద సముద్రాల గ్రామంలోని ఎస్సీ కాలనీకి ఎలుగుబంటి ప్రవేశించింది. పోచమ్మ గుడిలో నిన్న రాత్రి పది గంటల ప్రాంతంలో ఎలుగుబంటి వెళ్లడాన్ని గ్రామస్థులు గుర్తించారు. బయటకు వస్తే ఎవరిపై దాడి చేస్తుందో అనే భయంతో.. ఎలుగుబంటి ఆలయంలో ఉన్న సమయంలో గేట్లు మూసేశారు. శనివారం రాత్రి నుంచి ఎలుగుబంటిని గుడిలోనే నిర్బంధించి ఉంచారు.
ప్రస్తుతం ఆలయ గర్భగుడిలోనే దేవత విగ్రహం వెనుక ఎలుగుబంటి నక్కి ఉన్నందున ఎవరికీ కనిపించడం లేదు. ఉదయమే అటవీ శాఖ అధికారులకు గ్రామస్థులు సమాచారం అందించారు. గుడిలో ఉన్న కొబ్బరి చిప్పలను తినడానికి అప్పుడప్పుడు భల్లూకం వస్తూ పోతుందని గ్రామస్థులు తెలిపారు.
ఇవీ చూడండి: 'గవర్నర్ మాకు అన్యాయం చేశారు... ఇక ఆత్మహత్యలే శరణ్యం'