ETV Bharat / city

సీఎం జగన్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు ఉపసంహరణ - CM Jagan Latest news

సీఎం జగన్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు ఉపసంహరణకు.. తెలంగాణ ఉన్నతాధికారులనుంచి అనుమతి వచ్చింది. జగన్‌పై కేసు ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోరగా... కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు.. 2014లో ఫిర్యాదు చేసిన ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించినందున ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఎంపీడీవో చెప్పిన అభిప్రాయాన్ని నమోదు చేసుకున్నారు.

Withdrawal of election code violation case against CM Jagan

author img

By

Published : Feb 18, 2021, 4:47 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌పై కేసు ఉపసంహరణకు ప్రజాప్రతినిధుల కోర్టు అనుమతిచ్చింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు ఉపసంహరణకు అనుమతి వచ్చింది. అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించారని 2014లో జగన్‌పై కేసు నమోదైంది. ప్రస్తుత తెలంగాణలోని కోదాడ పోలీసులు పెట్టిన కేసు ఉపసంహరణకు కోర్టు అనుమతి మంజూరు చేసింది. జగన్‌పై ఛార్జిషీట్ ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయ్యింది.

ఆయనపై కేసు ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఎ-2, ఎ-3పై కోదాడ కోర్టు కేసు కొట్టివేసిందని తెలిపారు. 2014లో ఫిర్యాదు చేసిన ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ప్రభుత్వం నిర్ణయించినందున ఉపసంహరణకు అభ్యంతరం లేదని ఎంపీడీవో చెప్పారు. ఈ మేరకు.. జగన్‌పై ప్రాసిక్యూషన్ ఉపసంహరణకు ప్రజాప్రతినిధుల కోర్టు అనుమతి ఇచ్చింది.

ఇదీ చదవండి:

కుప్పంలో ప్రజాస్వామ్యం ఓడింది.. ఉన్మాదం గెలిచింది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.