వైసీపీని ఎందుకు గెలిపించామా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చిందని తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్.రమణ అభిప్రాయపడ్డారు. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మండలిని ఏర్పాటు చేస్తే.. జగన్ దానిని రద్దు చేసే ప్రయత్నాలు చేయటం అత్యంత బాధాకరమైన విషయమని వ్యాఖ్యానించారు. తెలంగాణ తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ మాట్లాడుతూ...వైకాపా మంత్రుల తీరు బాధ కలిగించిందన్నారు. మండలిలో సభ్యులు కాకపోయినా మంత్రి హోదాలో కౌన్సిల్‌కు హాజరై...ఛైర్మన్‌ని వ్యక్తిగతంగా దుర్భాషలాడటం శోచనీయమన్నారు. విజయసాయి రెడ్డి ఏ ఉద్దేశ్యంతో మండలి సమావేశాలకు హాజరయ్యారో స్పష్టం చేయలన్నారు. రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు సంబంధించి మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విలువను పెంచిందని పేర్కొన్నారు.
ఇదీచదవండి