ETV Bharat / city

'అసైన్డ్‌ భూములు లాక్కుని మరొకరికి ఇవ్వడమేంటి?' - ఏపీలో బలవంతపు భూసేకరణ

పేదలకు చెందిన అసైన్డ్ భూములను బలవంతంగా సేకరించి ఇళ్ల స్థలాల పేరిట మరొకరికి ఇవ్వడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అలాగే భూ సేకరణ ప్రాంతాలకు పోలీసుల్ని భారీగా ఎందుకు పంపుతున్నారని నిలదీసింది. దీనిపై డీజీపీని వివరణ కోరతామని చెప్పింది.

ap high court
ap high court
author img

By

Published : Mar 5, 2020, 5:16 AM IST

రాష్ట్రంలో ఇళ్లస్థలాల పంపిణీ కోసం పేదల అసైన్డ్‌ భూములు బలవంతంగా సేకరించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పేదల భూములు లాక్కుని మళ్లీ మరొక పేదలకు పంచడమేంటని ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇళ్ల స్థలాల పేరుతో చెట్లు కొట్టేయడమూ నేరమని స్పష్టం చేసింది. భూ సేకరణ ప్రాంతాలకు పోలీసుల్ని పంపడంపై డీజీపీని వివరణ కోరనున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఏవీ శేషసాయి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు జారీ చేసింది.

మా సంస్థ మాకు ఉంది

ఇళ్ల స్థలాల కోసం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూముల్ని అధికారులు బలవంతంగా తీసుకోవడాన్ని నిలువరించాలని, ప్రభుత్వ భూమిని స్వాధీనంలో ఉంచుకున్న పట్టాలు లేని పేదలను ఖాళీ చేయించకుండా తగిన ఆదేశాలు జారీచేయాలని కోరుతూ కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. పత్రికల్లో వచ్చిన కథనాలతో పాటు ఫొటోలు జతచేశారు. ఆ లేఖను సుమోటో పిల్​గా పరిగణించి బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ బలవంతపు భూ సేకరణ చేయడం లేదన్నారు. పోలీసుల ఫొటో భూసమీకరణ ఘటనకు సంబంధించినది కాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ....'ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటి వెనుక ఉద్దేశాలు మాకు తెలుసు. మాకు చాలా సంగతులు అందుతున్నాయి. మీ సంస్థను మీరు నడుపుతుంటే మా సంస్థ మాకుంది' అని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు కోసం ఏజీ గడువు కోరటంతో విచారణను ఈనెల 12కు వాయిదా వేసింది.

అధికారులే బాధ్యులవుతారు

రైతుల నుంచి సేకరించిన భూమిని... పేదలకు ఇళ్ల పట్టాల కింద ఇచ్చేందుకు ఈ నెల 25న ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ ఇప్పటికే రెండు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. తాజాగా మరో రెండు వ్యాజ్యాలు జత అయ్యాయి. సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదనలు వినిపిస్తూ... ఆ భూములపై మూడో వ్యక్తికి హక్కులు కల్పించకుండా నిలువరించాలన్నారు. ఆ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు పిచ్చిమొక్కలు తొలగించి, సర్వేహద్దులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం పిలిచిన టెండర్‌ ప్రక్రియను నిలువరించాలని న్యాయవాదులు చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం మధ్యంతర ఉత్తర్వులివ్వలేమని స్పష్టం చేసింది. టెండర్‌ పేరుతో అనవసరపు ఖర్చు చేస్తే అధికారులే బాధ్యులవుతారని చెప్పింది. ప్రజాధనం వృథా అవుతుందని భావిస్తే సీబీఐకి ఫిర్యాదు చేసుకోండని సూచించింది. ఈ ఫిర్యాదుల్లో కౌంటర్‌ దాఖలకు ఏజీ గడువు కోరటంతో... విచారణను ఈ నెల 12కు వాయిదా వేసింది. మార్చి 25కి మునుపే పట్టాలు ఇవ్వబోమని ఏజీ.... గతంలో కోర్టుకు తెలిపిన విషయాన్ని గుర్తుచేయటమేగాక మరోసారి శ్రీరామ్ నుంచి స్పష్టత తీసుకుంది.

ఘాటు వ్యాఖ్యలు

రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల జీవోని సమర్థిస్తూ ఇంప్లీడ్‌ పిటిషన్లు దాఖలు చేసిన సుమారు 450 మంది తరపున న్యాయవాది లక్ష్మీనారాయణ రెడ్డి వాదనలు వినిపించేందుకు యత్నించగా... 12న వాదనలు వింటామని తెలిపింది. తమను అనుమతించట్లేదంటూ వ్యాఖ్యానించిన న్యాయవాది లక్ష్మీనారాయణరెడ్డిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'కోర్టుని రాజకీయం చేయకండి... ప్రస్తుతం మీకేం హక్కుందని అనుమతించాలి' అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఇదీ చదవండి: 'ప్రాణాలు పోయినా భూములు వదులుకోం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.