రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు వర్తింపజేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వార్షిక ఆదాయం రూ. 8లక్షలలోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేసే ప్రతిపాదనకు 2019లోనే మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి బుధవారం అర్థరాత్రి జీవో 66ను విడుదల చేసింది. విద్యా, ఉద్యోగాల్లో ఈ 10 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతల మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణ పేదలకు ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ఓబీసీ సర్టిఫికెట్ల జారీకి కూడా ఆదాయ పరిమితి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్‌కు అనుగుణంగా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని తహసీల్దార్ కార్యాలయాలకు అధికారిక సమాచారం పంపినట్టు ప్రభుత్వం పేర్కొంది. రూ.8లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారికి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అగ్రవర్ణాల పేదలకు చెందిన రిజర్వేషన్ల కోటాలో మహిళలకు కూడా మూడోవంతు కొటా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ల జారీకి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు, తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చారు.
- అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం.. 2019 జనవరి 12వ తేదీన చట్టాన్ని (103 రాజ్యాంగ సవరణ చట్టం) అమల్లోకి తీసుకొచ్చింది.
- భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15, 16 లను అనుసరించి సామాజిక, విద్యాపరంగా వెనకబడిన వర్గాలకు విద్యా, ఉద్యోగాలలో ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
- ఈ చట్టం ప్రకారం ఏపీ ప్రభుత్వం 2021 జులై 14వ తేదీన జీవో 66ను జారీ చేసింది.
- వార్షిక ఆదాయం రూ. 8లక్షల లోపు ఉన్న అగ్ర వర్ణాలకు విద్య, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తారు.
ఎవరు అర్హులు కాదంటే..?
⦁ ఓ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి లేదా అంతకంటే ఎక్కువ ఉండరాదు
⦁ 1000 చదరపు అడుగుల పైబడి వైశాల్యంలో ఫ్లాట్ ఉండరాదు
⦁ కార్పొరేషన్స్ లేదా మున్సిపాలిటీ ప్రాంతాల్లో 100 చదరపు గజాలకు మించిన ప్లాట్ ఉండొద్దు.
⦁ మున్సిపాలిటీలు, కార్పొరేషన్యేతర ప్రాంతాల్లో 200 చదరపు గజాలకు మించిన నివాస ప్లాట్ ఉండకూడదు.
⦁ విద్యా రంగంలో సీట్ల కేటాయింపు, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ల అమలుకు ఏపీ ప్రభుత్వం శాతాలను కూడా నిర్ధారించింది. ఇందుకు సంబంధించి జీవోను విడుదల చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి:
క్ర.సంఖ్య | వెనకబడిన తరగతులు | శాతం |
i | Group-A Group-B Group-C Group-D Group-E Group-F (Kapus) | 7% 10% 1% 7% 4% 5% |
ii | Schedule Castes | 15% |
iii | Schedule Tribes | 6% |
Total | 55 % |
⦁ ఈబీసీలోని మహిళలకు విద్య, ఉద్యోగ రంగాల్లో 1/3 వంతును కేటాయించారు.
ఇదీ చదవండి:
Ys Sharmila : 'రాసి పెట్టుకోండి...నేను ప్రభంజనం సృష్టిస్తా..'