తితిదే ఆస్తుల విక్రయంపై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. తితిదే ఆస్తులపై శ్వేతపత్రం ఎప్పుడు ఇస్తారని హైకోర్టు ప్రశ్నించింది. తితిదే ఆస్తులు, దాతలిచ్చిన ఆస్తులపై శ్వేతపత్రం విడుదల గురించి కోర్టు ప్రస్తావించింది. ప్రజలు, భక్తులు, దాతలకు ఈ సమాచారం అవసరమన్న హైకోర్టు... శ్వేతపత్రం ఇస్తామని గతంలో తితిదే ఈవో అఫిడవిట్‌లో పేర్కొన్నారని గుర్తు చేసింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది వై. బాలాజీ వాదనలు వినిపించారు. దేవాదాయశాఖ అనుమతి లేకుండా తితిదే ఆస్తులు విక్రయిస్తోందని వాదించారు. స్థిర, చరాస్థుల రక్షణకు పారదర్శకత పాటించడం లేదన్న పిటిషనర్... అన్నిరకాల ఆస్తుల రక్షణ బాధ్యత తితిదేకు ఉందని పిటిషనర్ పేర్కొన్నారు. తదుపరి విచారణ ఈ నెల 14కి హైకోర్టు వాయిదా వేసింది.
ఇదీ చదవండీ... పంచాయతీ ఎన్నికల ప్రక్రియను నిలుపుదల చేయలేం: హైకోర్టు