ఎయిడెడ్ అధ్యాపకుల పోస్టింగ్‌లకు డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద, పార్ట్‌టైం అధ్యాపకుల పోస్టులు సహా అన్ని ఖాళీలనూ చూపిస్తామని కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్ ప్రకటించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐచ్ఛికాలను నమోదు చేసుకోవాలని సూచించారు. మొదట జోన్‌ల వారీగా కౌన్సెలింగ్ ఉంటుందని, ఇతర జోన్‌లలో మిగిలిపోయిన పోస్టులకు మరో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు.
జూనియర్ కళాశాలలకు దసరా సెలవులు 10 నుంచి..
జూనియర్ కళాశాలలకు ఈ నెల 10 నుంచి 17వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ విద్యామండలి పరీక్షల నియంత్రణ అధికారి రామసుబ్బన్న తెలిపారు. సెలవుల్లో ఎలాంటి తరగతులూ నిర్వహించరాదని పేర్కొన్నారు.
వ్యవసాయ కోర్సులకు దరఖాస్తులు...
వ్యవసాయ, పశువైద్య, ఉద్యాన అండర్ గ్రాడ్యుయేట్(యూజీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈ నెల 18వ తేదీతో ముగియనుందని ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ వర్సిటీ రిజిస్ట్రార్ గిరిధరకృష్ణ తెలిపారు. వివరాలను www.angrau.ac.in లో పొందవచ్చన్నారు. రైతు కోటాలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్దేశిత భూ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకుని పరిశీలన కేంద్రాల్లో ధ్రువీకరణ చేయించుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: చిన్నారుల అశ్లీల వీడియోలు... రంగంలోకి కేంద్ర హోంశాఖ... హైదరాబాద్‌లో అరెస్టు