ETV Bharat / city

ఇదోరకం బిగ్ బాస్ హౌస్.. నిద్రపోవుడే గేమ్.. 10 లక్షలిస్తరు..! - telugu big boss show

మిమ్మల్ని నిద్రా దేవత నిత్యం పూనుతుందా? నిద్రకు ఆగలేక ఊగిపోతుంటారా?? అయితే.. అర్జెంటుగా ఈ పోటీలో పార్టిసిపేట్ చేయండి. ప్రతిరోజూ చక్కగా నిద్రపోతే చాలు.. విన్నర్ మీరే! బహుమతిగా ఏకంగా 10 లక్షలు.. అక్షరాలా పది లక్షల రూపాయలు అందజేస్తారు. నమ్మలేకపోతున్నారా..? కానీ, ఇది నూటికి నూటాయాభై శాతం నిజం!! మరి, ఇంతకీ ఈ కాన్సెప్ట్ ఉద్దేశం ఏంటి? ఈ పోటీ ఎవరు పెడుతున్నారు..?? ఎందుకు??? ఇలాంటి డౌట్లకు టకా టకా ఆన్సర్స్ చూసేద్దాం రండి..

నిద్రపోటీ
నిద్రపోటీ
author img

By

Published : Sep 8, 2022, 8:04 PM IST

Updated : Sep 8, 2022, 8:48 PM IST

"బిగ్ బాస్" గేమ్ షో గురించి అందరికీ తెలిసిందే. ఇందులో టైటిల్ గెలిస్తే కాసుల పంట పండుతుంది. కానీ.. ఎంట్రీ అందరికీ సాధ్యం కాదు. ఇదంతా టీఆర్పీ రేటింగ్స్ తో కూడుకున్న యవ్వారం కాబట్టి.. నిర్వాహకులకు నచ్చిన, మెచ్చిన వాళ్లు మాత్రం హౌస్ లోకి అడుగు పెడతారు. కానీ.. ఇప్పుడు మేం చెప్పబోయే గేమ్ ఫుల్ వెరైటీగా ఉంటుంది. ఇందులో ఎవ్వరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. గెలిచిన వారు రూ.10 లక్షలు పట్టుకుపోవచ్చు. ఇప్పటికే రెండు సీజన్లు ముగిశాయి. లాస్ట్ సీజన్ ప్రైజ్ మనీ రూ.5 లక్షలు మాత్రమే! మూడో సీజన్లో డబుల్ చేశారు. ఇంతకీ.. ఈ హౌస్ లో సాగే గేమ్ ఏంటో తెలుసా? బిగ్ బాస్ షోలో కంటిస్టెంట్ల మాదిరిగా ఏడుపులు, అరుపులు, కేకలు.. యాక్షన్.. ఓవరాక్షన్.. కన్నింగ్.. ఇలాంటివి ఏవీ ఉండవు. సుష్టుగా తిని.. ప్రశాంతంగా నిద్రపోవాలి. అంతే.. ఎవ్వరు ఎక్కువ సేపు నిద్రపోతారో.. వాళ్లే గెలుస్తారు..!

నిద్రపోటీ
నిద్రపోటీ

ఈ కాంపిటేషన్ నిర్వహిస్తున్నది ఒక సంస్థ. పేరు "వేక్‌ఫిట్‌". ఇదొక పరుపుల తయారీ సంస్థ. నిద్రను ప్రోత్సహించడమే లక్ష్యంగా.. "స్లీప్‌ ఇంటర్న్‌ షిప్‌" పేరుతో ప్రతీ సంవత్సరం ఒక పోటీని నిర్వహిస్తోంది. ఇందులో పాల్గొనడానికి అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అలా వచ్చిన దరఖాస్తుల్లోంచి 15 మందిని ఫైనల్ చేస్తారు. వీరు గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు.

నిద్రపోటీ
నిద్రపోటీ

ఈ 15 మంది ఏం చేయాలంటే.. రోజుకు 9 గంటలు హాయిగా నిద్రపోవాలి. ఇలా 100 రోజులపాటు ఎలాంటి అంతరాయమూ లేకుండా టాస్క్ కంప్లీట్ చేయాలి. అయితే.. కళ్లు మూసుకొని నేను హాయిగానే పడుకున్నాను.. నాకు 10 లక్షలు ఇవ్వండి అంటే ఇవ్వరు. ఇలాంటి మహానటులు ఉంటారని వాళ్లకు మాత్రం తెలియదా? అందుకే వాళ్లు పక్కా ప్లాన్ తో వచ్చారు. ఈ పోటీకి అర్హత సాధించిన వారికి ఒక పరుపుతోపాటు, స్లీప్‌ ట్రాకర్‌ అందిస్తారు. వాటిని పట్టుకొని.. ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లిపోయి.. ఈ కాంపిటేషన్ లో పాల్గొనాలి.

నిద్రపోటీ
నిద్రపోటీ

పోటీదారులు ఇంట్లో ఎంత సేపు నిద్రిస్తున్నారనే విషయం.. స్లీప్ ట్రాకర్ ద్వారా.. నిర్వాహకులకు సెకన్లతో సహా తెలిసిపోతుంది. కాబట్టి తొండి చేయడానికి ఛాన్సే లేదు. ఈ పోటీలో.. కంటిస్టెంట్ల నిద్ర నాణ్యతను పరిశీలించి.. టాప్ 4 మెంబర్స్ ను ఫైనల్ రౌండ్‌కు ఎంపిక చేశారు. వీరిలో అందరికన్నా ఎక్కువగా నిద్రపోయి.. కుంభకర్ణుడి సోదరిగానో.. సోదరుడిగానో నిలిచిన వారిని విజేతగా అనౌన్స్ చేస్తారు. ఇవీ.. స్లీపింగ్ కాంపిటేషన్ రూల్స్.

నిద్రపోటీ
నిద్రపోటీ

గతేడాది నిర్వహించిన రెండో సీజన్‌లో 95 శాతం క్వాలిటీ నిద్రతో.. విజేతగా నిలిచింది కోల్‌కతాకు చెందిన త్రిపర్ణా చక్రవర్తి. ఈమెకు నిర్వాహకులు రూ. 5 లక్షల నగదు బహుమతి అందించారు. మిగిలిన ముగ్గురు ఫైనలిస్టులకు రూ. లక్ష చొప్పున అందజేశారు. ఇప్పుడు మూడో సీజన్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఓ అప్లికేషన్ ఆన్ లైన్లో పడేయండి. www.wakefit.co వెబ్ సైట్లోకి వెళ్లి ఫామ్ నింపండి. ఏమో.. నిద్రాదేవి మిమ్మల్ని ఆవహించి.. 10 లక్షలు అనుగ్రహిస్తుందేమో.. ఎవరికి తెలుసు?

Last Updated : Sep 8, 2022, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.