తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కొత్త వేతన సవరణకు సంబంధించిన దస్త్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు చేరింది. 30 శాతం ఫిట్‌మెంట్ పెంపుదలతో ఆర్థికశాఖ ప్రతిపాదనలు రూపొందించి... సీఎం ఆమోదానికి పంపింది. ఆయన సంతకం చేసిన అనంతరం... పీఆర్సీ అమలుకు సంబంధించి ఉత్తర్వులు విడదలయ్యే అవకాశం ఉంది. సాధారణంగా తదుపరి నెలకు చెందిన వేతన బిల్లులు... ఈనెల 20 లోపు సిద్ధం కావాలి. తాజాగా పీఆర్సీకి సంబంధించిన ప్రతిపాదనలపై ఉత్తర్వులు జారీకి... రెండు, మూడు రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
20 వరకు ప్రక్రియ పూర్తైతే... వచ్చేనెల నుంచి పెంపుదల అమల్లోకి వస్తుంది. బిల్లుల తయారీకి సమయం సరిపోని పక్షంలో.. జూన్ నుంచి వేతనాల పెంపుదల అమల్లోకి రావచ్చు. అప్పుడు మే నేల వేతనాన్ని... బకాయిగా చెల్లిస్తారని తెలుస్తోంది. పీఆర్సీ జీవోలు జారీఅయిన తర్వాత నిపుణులతో కూడిన పరిష్కారాల కమిటీని ఆర్థికశాఖ ఏర్పాటుచేయనుంది. ఉత్తర్వులు వచ్చిన తర్వాత తలెత్తే సందేహాల నివృత్తిపై ఆ కమిటీ దృష్టిసారించనుంది.
ఇదీ చూడండి: