విశాఖలోని గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్లో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ... వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి ...జాతీయ మెడికల్ కౌన్సిల్‌కు లేఖ రాశారు. వైద్య కళాశాల అనుమతి కోసం గీతం యాజమాన్యం నకిలీ పత్రాలు సమర్పించిందని ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన భూమిలో ల్యాబ్‌లు, హాస్టళ్లు, సిబ్బంది నివాసాలు కట్టారని లేఖలో పేర్కొన్నారు. వాటికి ఎలాంటి అనుమతీ తీసుకోలేదన్నారు. ఆర్డీవో బృందం విచారణలో 40 ఎకరాల 51సెంట్ల సర్కారు భూమిని ఆక్రమించినట్టుగా తేలిందన్నారు. ఎంసీఐ నిబంధనలను ఎక్కడా పాటించకుండా మెడికల్ కళాశాలను నిర్మించారని విజయసాయి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: