దేశంలో అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నా... వ్యవసాయ రంగం ముందుకు సాగట్లేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో ప్రారంభమైన వ్యవసాయ సదస్సుకు ఆయన హాజరయ్యారు. 'అగ్రిటెక్ సౌత్-2020' పేరుతో మూడు రోజుల పాటు సాగనున్న ఈ సదస్సులో తెలంగాణ మంత్రులు మహమూద్ అలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. అయినా.. అన్నదాతల కోసం ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని తెలిపారు. నేటికీ 50 శాతం రైతులకే బ్యాంకుల నుంచి రుణాలు అందుతున్నాయని చెప్పారు. మిగిలిన వారంతా ప్రైవేటు సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు.
రుణమాఫీ అనేది రైతులకు తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీర్ఘకాలిక పరిష్కారం చూపాల్సిన అవసరముందని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: