ప్రభుత్వం కుట్రపన్నుతోంది.. వెలగపూడి రైతుల ఆగ్రహం - వెలగపూడి రైతులు న్యూస్
రాజధాని రైతుల రిలే నిరాహారదీక్షలు 25వ రోజుకు చేరాయి.144 సెక్షన్ అమలులో ఉన్నందున పోలీసులు రైతులను దీక్షలో కూర్చునేందుకు అనుమతించడం లేదు. దీంతో వెలగపూడి దీక్ష టెంట్లకు ఎదురుగా ఉన్న గృహం ముందు కూర్చుని రైతులు, మహిళలు నిరసనలు కొనసాగిస్తున్నారు. శాంతియుతంగా జరుగుతన్న దీక్షలను పోలీసులతో అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.