వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని 14 రోజులు క్వారంటైన్ లో ఉంచాలని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. ఏపీలో విజయసాయిరెడ్డి చాలా ప్రాంతాలు తిరుగుతూ సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు. గతంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన పుల్లెల గోపిచంద్‌ను హోమ్ క్వారంటైన్లో ఉంచారని గుర్తుచేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ వస్తునందున్న హోమ్ క్వారంటైన్లో ఉంచాలని తెలంగాణ డీజీపీని వర్ల రామయ్య కోరారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో కొత్తగా 48 కరోనా పాజిటివ్ కేసులు..ఒకరు మృతి