ETV Bharat / city

'కేసుల్లో చిక్కుకున్న వైకాపా నేతలు.. రాజ్యసభకు క్యూ'

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, కేసుల్లో చిక్కుకున్న వైకాపా నేతలు పెద్దల సభలో ఏం ప్రశ్నించగలరని తెదేపా నేత వర్ల రామయ్య ప్రశ్నించారు. వైకాపా రాజ్యసభ అభ్యర్థులు అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణలపై పలు కేసులున్నాయన్న ఆయన... సీఎం జగన్​కు వీరికన్నా మంచి అభ్యర్థులే దొరకలేదా అని నిలదీశారు. వైకాపా తీరు పెద్దల సభ గౌరవాన్ని తగ్గించేలా ఉందని మండిపడ్డారు.

Varla ramaiah
వర్ల రామయ్య
author img

By

Published : Mar 16, 2020, 6:47 PM IST

మీడియాతో మాట్లాడుతున్న వర్ల రామయ్య

వైకాపా నుంచి పెద్దల సభకు.. కేసుల్లో చిక్కుకున్న నేతలు వెళ్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన వైకాపా తరఫున రాజ్యసభ బరిలో ఉన్న అభ్యర్థులపై విమర్శలు చేశారు. 10 కేసుల్లో అభియోగాలున్న అయోధ్యరామిరెడ్డి, ఏ4గా ఉన్న మోపిదేవి వెంకట రమణ రాజ్యసభకు వెళ్లడాన్ని ఆయన తప్పుబట్టారు. అక్రమాలు చేయటంలో ఈ వైకాపా నేతలు ఏ రాష్ట్రాన్నీ వదల్లేదని విమర్శించారు. పెద్దల సభకు పంపేందుకు సీఎం జగన్​కు మంచి అభ్యర్థులే దొరకలేదా? అని ప్రశ్నించారు. ఈ నేతలు రాజ్యసభను సైతం కలుషితం చేసేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్న విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఏం చేస్తున్నారో అందరికీ తెలుసని వర్ల రామయ్య అన్నారు. రాంమనోహర్ లోహియా, కులదీప్ నయ్యర్ వంటి మహానుభావులు వెళ్లిన రాజ్యసభకు.. కేసుల్లో చిక్కుకున్న నేతలు క్యూ కడుతున్నారని విమర్శించారు. వైకాపా అవినీతి నేతలకు కేరాఫ్ అడ్రస్ అన్న వర్ల... రాజ్యసభ బరిలో నిలిచిన తాను నైతికంగా గెలిచానన్నారు.

ఇదీ చదవండి : నలుగురు రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసిన వైకాపా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.