ఉగ్రవాదులను ఆదర్శంగా తీసుకోవాలని ఎస్సీ యువతని ప్రోత్సహిస్తున్న సీఐడీ అధికారి సునీల్ కుమార్, అడిషనల్ ఎస్పీ మోకా సత్తిబాబులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని వర్ల రామయ్య గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. వారిద్దరిపై చర్య తీసుకోవాలని డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని లేఖలో పేర్కొన్నారు. సునీల్ కుమార్ స్థాపించిన ఏఐఎం సంస్థ కార్యక్రమంలో భారతీయ సంస్కృతిని కించపరిచేలా మాట్లాడారని ఫిర్యాదు చేశారు. సివిల్ కండక్ట్ రూల్స్‌ను ఉల్లంఘించిన ఇద్దరు అధికారులపై చర్య తీసుకోవాలని కోరారు. వీరిపై రాజద్రోహం నేరంపై కేసు పెట్టాలని కోరారు.
ఇదీ చదవండి: జైలు నుంచి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి విడుదల