ETV Bharat / city

కేంద్రం పంపిన వ్యాక్సిన్లను పక్కదారి పట్టించారు: అయ్యన్న - TDP Latest News

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్​పై తెదేపా నేతలు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సీఎం జగన్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. వ్యాక్సిన్​ను పక్కదారి పట్టించారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని పక్కనబెట్టి.. కక్ష సాధింపు చర్యలకు సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారని ధ్వజమెత్తారు.

అయ్యన్నపాత్రుడు
అయ్యన్నపాత్రుడు
author img

By

Published : May 12, 2021, 7:38 PM IST

  • ఉత్తరం రాసినా వాక్సిన్లు ఇవ్వడం లేదని కర్నూల్, కడప స్టేషన్ల లో కేసులు పెట్టించి పట్టుకు రావచ్చు కదా? సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీ రాసిచ్చి పోరా? ఏంది వాళ్ళను అడుక్కొనేది? (2/2)

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) May 12, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంగం డెయిరీని స్వాధీనం చేసుకుని అమూల్​కు అప్పగించినట్లు భారత్ బయోటెక్, సీరం ఇనిస్టిట్యూట్​లను స్వాధీనం చేసుకునేందుకు జగన్ రెడ్డి.. ఏసీబీ, సీఐడీలను పంపగలరా అని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్నపాత్రుడు నిలదీశారు. "మన ఏసీబీ, సీఐడీలు... కృష్ణ ఎల్లా, పూనావాలాను ఎత్తుకు రాలేరా..? ఉత్తరం రాసినా వాక్సిన్లు ఇవ్వడం లేదని కర్నూలు, కడప స్టేషన్లలో కేసులు పెట్టించి పట్టుకురావచ్చు కదా? వాళ్లను వ్యాక్సిన్లు అడుక్కోకుండా సీఐడీ ఆఫీసులో రోజుకు తొమ్మిది గంటలు కూర్చోబెడితే మొత్తం కంపెనీ రాసిచ్చి పోరా?" అని ట్విటర్ వేదికగా ఎద్దేవా చేశారు.

కేంద్రం పంపిన వ్యాక్సిన్లను జగన్మోహన్ రెడ్డి పక్కదారి పట్టించారని మరో ట్వీట్​లో అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రాగా... కోవాగ్జిన్ చంద్రబాబు బంధువులది కాబట్టే ఇవ్వట్లేదంటూ విమర్శలు మొదలపెట్టారని దుయ్యబట్టారు. "కేంద్రం పంపిన వ్యాక్సిన్లను ఎక్కువ వృథా చేస్తున్న రాష్ట్రాల‌్లో ఏపీ మొదటి స్థానంలో ఉన్నందుకే వ్యాక్సిన్ల స‌ర‌ఫ‌రాపై కేంద్రం ఆంక్షలు పెట్టిందని జాతీయ మీడియా వెల్లడించింది. వ్యాక్సిన్ వృథా చేయకుండా కేంద్రం కళ్లుగప్పి వైకాపా ఎమ్మెల్యేలు, నేతలకు పక్కదారి పట్టించారని వెల్లడైంది. ప్రజ‌ల ప్రాణాలు కాపాడేందుకు అత్యవ‌స‌ర‌మైన వ్యాక్సిన్లు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తెప్పించుకుంటే, జ‌గ‌న్‌రెడ్డి మాత్రం చంద్రబాబు, తెదేపా నేత‌ల‌పై త‌ప్పుడు కేసులు పెట్టే ప‌నిలో ఉన్నారు." అని మండిపడ్డారు.

సీఎం మానసిక స్థితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలి: ఎన్.బి.సుధాకర్ రెడ్డి

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు... ముఖ్యమంత్రికి పిచ్చిపట్టిందని ఆరోపించినందున... జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితిపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని తెదేపా అధికార ప్రతినిధి ఎన్.బి.సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. "మానసిక అసమర్థుడు రాజ్యాంగం ప్రకారం పాలనకు పనికిరాడు. ఆరోపణలు చేసిన రఘురామకృష్ణరాజుపై రామచంద్రాపురం పోలీసు స్టేషన్లో కొందరు ఫిర్యాదు చేసినందున.. ఈ కేసు రిజిస్టర్ చేసి న్యాయ విచారణకు పంపాలి. అప్పుడే అన్ని నిజాలు బయటకు వస్తాయి" అని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

దేశంలోనే టాప్‌టెన్‌లో మన యూనివర్సిటీలు నిలవాలి: సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.