వృద్ధులకు ఆధార్ లేకుండానే వ్యాక్సినేషన్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రభుత్వం మెమో దాఖలు చేసింది. రెండు రోజుల్లో వృద్ధులకు వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది.
వ్యాక్సినేషన్ విషయంలో తగిన ధృవీకరణ పత్రాలు లేని వృద్ధులు పడుతున్న ఇబ్బందులపై.. ఈనాడు వార్తను అమికస్ క్యూరీ కోర్టు దృష్టికి తెసుకువెళ్లారు. ఎట్టకేలకు ఈ సమస్యకు ప్రభుత్వ నిర్ణయంతో పరిష్కారం లభించినట్టైంది.
ఇదీ చదవండి: