Unsecured loan to MSMEs : కొవిడ్ కారణంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఊరటనిచ్చే ప్రకటన చేసింది కేంద్రం. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ పథకం కింద కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా అందే రుణాలతో కొంత మేర వెసులుబాటు కలిగించనుంది. బడ్జెట్‌లో ప్రకటించిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు క్రెడిట్ గ్యారంటీ ట్రస్టు (సీజీటీఎంఎస్‌ఈ), ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకాల ద్వారా అదనపు రుణాలు పొందే అవకాశం ఏర్పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 97,428 ఎంఎస్‌ఎంఈలలో 50-60 శాతం సంస్థలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి.
బ్యాంకర్లు కరుణిస్తేనే..
బడ్జెట్‌లో ప్రకటించిన క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ పథకంతో ఎంఎస్‌ఎంఈలకు ప్రయోజనం చేకూరుతుందని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. కొలేటరల్ సెక్యూరిటీ లేకుండా రూ.2 కోట్ల వరకు రుణాన్ని పొందొచ్చని చెబుతున్నా.. ఆ మేరకు రుణాలిచ్చేలా బ్యాంకర్లకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించాలని కోరుతున్నాయి.
అత్యవసర రుణానికి మరో అవకాశం
ఆత్మనిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ పథకాన్ని వినియోగించుకునేందుకు గడువును 2023 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ పథకం కింద రూ.41,600 కోట్ల కార్పస్ ఫండ్‌ను 2020లోనే ప్రకటించింది. ఈ రుణాన్ని పొందడానికి ఉద్యమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 7 కోట్ల ఎంఎస్‌ఎంఈలు ఉంటే, ఉద్యమ్ పోర్టల్‌లో 66 లక్షలు మాత్రమే నమోదయ్యాయి. 60 లక్షల సంస్థలు మాత్రమే రుణాలు పొందాయి.
ఇదీ చదవండి : Polavaram: పోలవరానికి ఇలా.. కెన్-బెత్వాకు అలా
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!