ETV Bharat / city

కొత్త ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి తప్పనిసరి: షెకావత్ - Union Water Resources Minister Shekhawat's letter news

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని సూచించారు.

Union Water
Union Water
author img

By

Published : Jan 16, 2021, 4:18 PM IST

Updated : Jan 16, 2021, 5:06 PM IST

తెలుగురాష్ట్రాల సీఎంలకు కేంద్ర జలవనరులశాఖ మంత్రి షెకావత్ లేఖ రాశారు. రెండు రాష్ట్రాల్లో నిర్మాణంలోని ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెంటనే ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 6 నాటి అపెక్స్ కౌన్సిల్‌ నిర్ణయం అమలు చేయాలని ఆదేశించారు.

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణ, ఏపీ పరస్పరం కేంద్రానికి ఫిర్యాదు చేశాయి. ఇరురాష్ట్రాల ఫిర్యాదులపై స్పందించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ... అక్టోబర్ 6న ఇద్దరు సీఎంలు, మంత్రులు, అధికారులతో అపెక్స్ కౌన్సిల్ భేటీ అయింది. తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.

డీపీఆర్​లు ఇవ్వాలి...

కృష్ణా నదిపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను ఏపీ చేపట్టిందన్న షెకావత్‌... డీపీఆర్‌లు ఇవ్వాలని లేఖలో కోరారు. అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాలు నడచుకోవాలన్నారు. డీపీఆర్‌లు, ఇతర వివరాలు ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని ఉద్ఘాటించారు.

ఒక్కటి కూడా...

కృష్ణాపై 8, గోదావరిపై 7 ప్రాజెక్టుల డీపీఆర్‌లు తెలంగాణ ఇవ్వాలని ఆదేశించారు. డీపీఆర్‌లు సహా అన్ని రకాల అనుమతులు తీసుకోవాలని జలశక్తి శాఖ సూచించింది. తెలంగాణ నుంచి ఒక్క డీపీఆర్‌ కూడా రాలేదని పేర్కొన్న షెకావత్... రాయలసీమ ఎత్తిపోతలపై నిబంధనల మేరకు డీపీఆర్ ఇవ్వాలన్నారు. పట్టిసీమ 3వ దశ డీపీఆర్‌ ఇవ్వాలని గోదావరి బోర్డు కోరిన విషయాన్ని ప్రస్తావించారు. పురుషోత్తపట్నం మినహా దేనికీ పూర్తి డీపీఆర్ ఇవ్వలేదని కేంద్రమంత్రి వెల్లడించారు.

గతనెల 11న తెలంగాణ, 16న ఏపీ సీఎం తనను కలిశాక ఎలాంటి పురోగతి లేదని తెలిపారు. డీపీఆర్‌లు వెంటనే ఇచ్చేలా చూడాలని సీఎంలకు వేర్వేరుగా లేఖలు రాశారు.

ఇదీ చూడండి: ఈ సమయం కోసమే ప్రపంచమంతా ఎదురుచూస్తోంది : గవర్నర్

Last Updated : Jan 16, 2021, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.