ETV Bharat / city

గోదావరి, కృష్ణా నదుల పునరుజ్జీవానికి రూ.4,027 కోట్లు

దేశంలోని 13 ప్రధాన నదులను రూ.19,342 కోట్లతో పునరుజ్జీవింపచేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయించింది. ఇందులో గోదావరి నది పునరుజ్జీవానికి రూ.1,700.84 కోట్లు, కృష్ణా పునరుజ్జీవానికి రూ.2,327.47 కోట్లు ఖర్చు చేయనున్నారు.

river
river
author img

By

Published : Mar 15, 2022, 4:55 AM IST

Updated : Mar 15, 2022, 5:30 AM IST

దేశంలోని 13 ప్రధాన నదులను రూ.19,342 కోట్లతో పునరుజ్జీవింపచేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన డీపీఆర్‌ను కేంద్ర మంత్రులు భూపేందర్‌యాదవ్‌, గజేంద్రసింగ్‌ షెకావత్‌లు సోమవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ నదుల పరీవాహక ప్రాంతం చుట్టూ మొక్కలను పెంచి భూగర్భజలాలను పరిరక్షించాలని, నదుల కోతను అరికట్టాలని కేంద్రం ప్రణాళిక రూపొందించింది. ఇందులో గోదావరి నది పునరుజ్జీవానికి రూ.1,700.84 కోట్లు, కృష్ణా పునరుజ్జీవానికి రూ.2,327.47 కోట్లు ఖర్చు చేయనున్నారు. గోదావరికి కేటాయించిన నిధుల్లోంచి తెలంగాణలో రూ.677.28 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లో రూ.39.05 కోట్లు, కృష్ణా నదికి ప్రకటించిన నిధుల్లోంచి తెలంగాణలో రూ.130.83 కోట్లు, ఏపీలో రూ.204.98 కోట్లు ఖర్చు పెడతారు. ఇలా, తెలుగు రాష్ట్రాల్లో రూ.1,052 కోట్లతో రెండు నదుల ప్రక్షాళన చేపట్టి 1,39,645 హెక్టార్లలో పచ్చదనం పెంపునకు చర్యలు తీసుకుంటారు.

ఇదీ చదవండి: Jal Shakti Ministry Review: గెజిట్‌ అమలు పురోగతి ఎంతవరకు వచ్చింది?

Last Updated : Mar 15, 2022, 5:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.