ETV Bharat / city

Parlament: 'పంచాయతీ నిధుల దుర్వినియోగం పెరిగిపోతోంది' - పార్లమెంటులో ఏపీ వ్యవహారాలు

Parlament: ఏపీలో పంచాయతీ నిధుల దుర్వినియోగం పెరిగిపోతోందని కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆరోపించారు. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు.

parlament
పార్లమెంట్
author img

By

Published : Jul 28, 2022, 9:56 AM IST

Parlament: రాష్ట్రంలో పంచాయతీ నిధుల దుర్వినియోగం, మళ్లింపు పెరుగుతున్నాయని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చెప్పారు. బుధవారం రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. ‘‘2019-20 ఆడిట్‌ నివేదికలో పొందుపరిచిన దాదాపు లక్ష పరిశీలనల్లో (అబ్జర్వేషన్స్‌) 0.57% (570)ని దుర్వినియోగం లేదా మళ్లింపునకు సంబంధించినవిగా వర్గీకరించారు. అలాగే 2020-21కి సంబంధించి మొత్తం 3.57 లక్షల పరిశీలనలు రికార్డు చేయగా, అందులో 0.95% (3,391.5)ని దుర్వినియోగం లేదా మళ్లింపునకు సంబంధించినవిగా గుర్తించారు.

స్థానిక సంస్థలు కేంద్ర ఆర్థిక సంఘాల నిధులు వినియోగించే విషయంలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని తేవడానికి కేంద్ర శాఖ ఆడిట్‌ ఆన్‌లైన్‌ పేరుతో ఒక అప్లికేషన్‌ను ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీలు 2019-20 సంవత్సరంలో 4,088 (31%), 2020-21లో 14,034 (100%) ఆడిట్‌ రికార్డులు సిద్ధంచేశాయి. పంచాయతీల కోసం విడుదల చేసిన నిధులను వాటి ఖాతాల నుంచి మళ్లించలేదని ఏపీ ప్రభుత్వం చెప్పింది’’ అని కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ వెల్లడించారు.

విభజన సమస్యల పరిష్కారం ఎప్పటికో చెప్పలేం: కేంద్రం
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి కచ్చితమైన సమయాన్ని చెప్పలేమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ తెలిపారు. బుధవారం రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘విభజన చట్టంలోని చాలా అంశాలు ఇప్పటికే అమలవుతున్నాయి. వివాదాల పరిష్కారం అన్నది నిరంతర ప్రక్రియ. అందుకు కచ్చితమైన సమయం చెప్పలేం. ద్వైపాక్షిక సమస్యల పరిష్కారం కేవలం ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే సాధ్యమనేది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. అందువల్ల పరస్పర సర్దుబాటు, అవగాహనతో సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికి కేంద్రం సహకారం మాత్రమే అందించగలదు’ అని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.