ETV Bharat / city

గవర్నర్, సీఎం జగన్​​తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ - minister dharmendra pradhan tour of AP news

రాజ్​భవన్​లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు. అనంతరం సీఎం జగన్ తో సమావేశమయ్యారు.

union-minister-dharmendra-pradhan-meets-the-andhrapradesh-governor
author img

By

Published : Nov 8, 2019, 2:35 PM IST

కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. దాదాపు గంట పాటు ఈ సమావేశం జరిగింది. వివిధ అంశాలపై చర్చించుకున్న ఇరువురు రాష్ట్ర ప్రాజెక్టులపైనా ప్రస్తావించుకున్నట్లు సమాచారం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని బిశ్వభూషణ్‌ కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిసింది. అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్​తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను కేంద్రమంత్రితో సీఎం చర్చించారు.

గవర్నర్, సీఎం​తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ భేటీ

ఇదీ చదవండి : ''గ్రామ న్యాయాలయాల ఏర్పాటు దిశగా ఏం చేస్తున్నారు?''

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.