ETV Bharat / city

Accident: ఇద్దరు చిన్నారుల పైనుంచి దూసుకెళ్లిన వాహనం.. అక్కడికక్కడే మృతి - vehicle crashed into two girls

ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని లారీ ఢీకొట్టడంతో కిందపడ్డారు. అదే సమయంలో పక్కనుంచి వస్తున్న వాహనం వారిపైకి దూసుకెళ్లింది. తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా ఉండవల్లి మండలం ఉత్తరాపూర్​లో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు బాలికలు మృతి చెందగా.. వారి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.

accident
accident
author img

By

Published : Jul 31, 2021, 4:23 PM IST

తెలంగాణలోని గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్రవాహనంపై నుంచి కిందపడిన వారి మీదుగా ఓ వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందగా.. వారి తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.

ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలతో మానవపాడు మండలం చెన్నిపాడు నుంచి కర్నూలు వెళ్తున్నాడు. ఉండవల్లి మండలం ఉత్తరాపూర్ చేరుకోగానే.. జాతీయరహదారిపై ద్విచక్రవాహనంపై వెళ్తున్న వారిని లారీ ఢీకొట్టింది.

లారీ ఢీకొట్టడం వల్ల బైక్​పై ఉన్న వ్యక్తి, అతడి కుమార్తెలు కిందపడ్డారు. అదే సమయంలో పక్క నుంచి వస్తున్న వాహనం ఇద్దరు బాలికలపై నుంచి దూసుకెళ్లింది. ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఆ వ్యక్తిని అంబులెన్స్​లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం బాలికల మృతదేహాలను ప్రభుత్వాస్పత్రికి పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.