ETV Bharat / city

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​కు బెయిల్​ - రవిప్రకాశ్​కు ఎట్టకేలకు బెయిల్​

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​కు షరతులతో కూడిన బెయిల్​ మంజూరైంది. ఇంతకుముందు బెయిల్​ కోసం పలుమార్లు పెట్టుకున్న అభ్యర్థనలు తిరస్కరణకు గురయ్యాయి. చంచల్​గూడా జైల్లో రిమాండ్​ ఖైదీగా ఉన్న రవిప్రకాశ్​కు ఎట్టకేలకు నాంపల్లి కోర్టు బెయిల్​ ఇచ్చింది.

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​కు బెయిల్​
author img

By

Published : Oct 17, 2019, 9:38 PM IST

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్​కు బెయిల్​ మంజూరైంది. ఫోర్జరీ, నిధుల మళ్లింపు, మోసం కేసుల్లో ప్రధాన నిందితునిగా ఉన్న రవిప్రకాశ్​కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. లక్ష రూపాయల రెండు పూచికత్తులతోపాటు హైదరాబాద్‌ విడిచి వెళ్లొద్దని ఆదేశించింది. వారానికోసారి పోలీసుల ముందు హాజరుకావాలని సూచించింది.

సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌స్టేషన్‌లో రవిప్రకాశ్‌ పై ఇవాళ మరో కేసు నమోదైంది. నకిలీ మెయిల్‌ ఐడీ సృష్టించి మోసం చేశారని ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాశ్‌ జైలు నుంచి విడుదలకాగానే ఈకేసులో విచారించే అవకాశముంది.

ఇదీ చూడండి: భారత సరిహద్దుల్లోని శాటిలైట్ వీడు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.