ETV Bharat / city

ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాశ్​

ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ... టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​ హైకోర్టును ఆశ్రయించారు.

ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాశ్​
ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన రవిప్రకాశ్​
author img

By

Published : Jul 10, 2020, 7:10 AM IST

ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ... టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​ హైకోర్టును ఆశ్రయించారు. బంజారాహిల్స్​లో నమోదైన క్రిమినల్ కేసుల ఆధారంగా.. ఈడీ ఇటీవల ఈసీఐఆర్ నమోదు చేసిందని రవిప్రకాశ్​ తెలిపారు. కేసులో తనను నిందితుడిగా చేర్చినందున.. అరెస్టు చేసే అవకాశం కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏబీసీపీఎల్​ వాటాదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై రవిప్రకాశ్​పై అనేక కేసులు నమోదు చేశారని... ఆయన తరఫు న్యాయవాది వివరించారు. ఆ కేసులపై హైకోర్టు స్టే ఉన్నందున... ఈడీ కేసులో అరెస్టు చేయాలని చూస్తున్నారని పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు... ఈడీకి నోటీసులు జారీ చేసి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.

ఇవీ చూడండి:

సెప్టెంబరు 11న వైఎస్‌ఆర్‌ ఆసరా... డ్వాక్రా రుణాల్లో తొలివిడత చెల్లింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.