రాష్ట్రంలో ఆర్ధిక పరిస్థితి చూస్తే ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. సలహాదారుల పేరుతో మాత్రం ప్రభుత్వ సొమ్ము దోచి పెడుతున్నారని విమర్శించారు. అవసరానికి మించి సలహాదారులను నియమిస్తూ రాజకీయ నిరుద్యోగులకు పునరావాసం కల్పిస్తున్నారన్నారని ఆరోపించారు.
మంత్రులు 23 మంది ఉంటే.. సలహాదారులు మాత్రం 33 మంది ఉన్నారని తులసి రెడ్డి అన్నారు. వారిలో ఎంతమంది ఉపయోగపడే సలహాలిస్తున్నారని ప్రశ్నించారు. వారికి కనీసం ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా లభించడం లేదన్నారు. అవసరానికి మించిన సలహాదారులను తక్షణమే తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు.
ఇదీ చదవండి: కొవిడ్-19 వ్యాక్సిన్ ఆగస్టు 15 లోపు కష్టమే!